telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శివుని అవతారంలో బాలయ్య..

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ప్రేక్షకులు ఏ స్థాయి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంత కాలంగా బాలకృష్ణ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే తనకు రెండు బ్లాక్ బస్టర్లు అందించిన బోయపాటితో మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా బీబీ3గా ప్రచారం అవుతుంది. ఈ సినిమాపై అభిమానులు తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు.  ఇందులో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్గా. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో ఆసక్తి పెరిగిపోయింది. ‘బీబీ3’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తెలుసుకోవడానికి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగువారు ప్రత్యేకంగా భావించే ఉగాది పర్వదినం రోజున ‘బీబీ3’ సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. చెప్పినట్టుగానే ఈ రోజు ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ ‘అఖండ’ అని టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో బాలయ్య ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. ఈ వీడియో చూస్తే బాలయ్య అభిమానులకు ఊపు రాక మానదు. మీరు కూడా ‘అఖండ’ టైటిల్ రోర్ ను వీక్షించండి.

Related posts