telugu navyamedia
సినిమా వార్తలు

రెప్ప చాటు మౌనం!

chilipi kallu poetry corner
రెప్పచాటు మౌనం..
పెదవి దాటనీయకుంది..,
హృది లోని మౌన రాగం..
గుండె లయను తడుతోంది…,
వెన్నెలలో విరిసిన విరులన్నీ..
కను కొలనులనే కవ్విస్తుంటే..,
సన్నజాజుల పరిమళాలన్నీ ..
చిరుగాలులకే…నునుసిగ్గవుతుంటే..,
అరవిచ్చిన లాస్యాలన్నీ..
అద్భుతాలు సృష్టిస్తుంటే..,
అవధులే లేని మమతలన్నీ…
అంతులేని పరవశమైపోతుంటే…,
మాటలే కరువైన వేళ..
మౌనం మాట్లాడే వేళ..,
తలపులే ఒకటైన వేళ..
తనువులే పులకించే వేళ..,
వర్ణించుట..ఎవరి తరము..?
ఆ అందమైన  దృశ్యకావ్యాన్ని..!!
-శ్రీమతి చిట్టె మాధవి, కడప

Related posts