telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్ .టి .ఆర్ “సహజ యశోపద్మశ్రీ విభూషితులు”

ఈరోజు మహా సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారి జయంతి . ఈ సందర్భంగా వారికి నివాళి .
1968లో నాటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఎన్ .టి .రామారావు, అక్కినేని నాగేశ్వర రావు కు ఒకేసారి ప్రకటించింది. అప్పుడు ఘంటసాల వెంకటేశ్వర రావు, ఎన్ .టి . రామారావు గారిని సహజ యశోపద్మశ్రీ విభూషితులు అని కీర్తిస్తూ ఓ వ్యాసం వ్రాశారు. అది ఇప్పుడు నవ్య పాఠకుల కోసం. నటరత్న పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారిని గురించి ఏ ఒక్కరు సోదర ఆంధ్ర ప్రజానీకానికి చెప్పగలిగింది. ఏమీలేదు. నటునిగా, దేశహితైషిగా, ఆత్మీయునిగా తమకు తాముగానే ఆ మహావ్యక్తిని సోదర ఆంధ్రప్రజలు సంపూర్ణంగా అర్ధం చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు.

రెండు దశాబ్దాలకు పైగా ఆ మహానటునితో నాకు గల సహచర్యాన్ని బట్టి, వృత్తి జీవితంలో ఆయనతో తేదోడు వాదోడుగా ఉండగలిగే సాన్నిహిత్యాన్ని బట్టి ఈ సందర్భంలో నా ఆనందాన్ని వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం నా అదృష్టం. నటుడిగా శ్రీ రామారావుగారు సాధించిన విజయాలు ఎన్నో మహోన్నతమైన విభిన్న ప్రవృత్తులు గల పాత్రలలో ఆయన నటించడం కాదు ఆ పాత్రలలో జీవించారు. ముఖ్యంగా ఆయన నటించిన హృదయ ప్రధానమైనవి. ఆ కారణం చేతనే ఆవేశపూరితమైన సంగీతం ఆ మహానటుని ముఖతః వ్యక్తపరచగలిగే అవకాశం నాకు కలిగింది.

హృదయోద్వేగాలను అతి సహజంగా ప్రదర్శించగల మూర్తిమంతం ఆయనది. భారత ప్రజాహృదయాలలో ప్రతిష్ఠితమైన ఉదాత్త గంభీరమైన రామకృష్ణాది అవతారమూర్తుల పాత్రలేకాదు పౌరాణిక, చారిత్రిక, సాంఘిక పాత్రలు ఏదైనా అయన నటనలో ఎంతో సహజంగా ప్రదర్శింపబడతాయి. గాయకునిగా నా అనుభవాన్ని పురస్కరించుకొని అనగలిగే మాట.శ్రీ రామారావు గారు ధరించిన ఉదాత్త, గంభీర పాత్ర ద్వారా ఆవేశపూరితము, గంభీరము, గాఢమైన సంగీతాన్నికి తెలుగు చలనచిత్రాలుకు  అందించగలిగేయి.ఆయన నటనలో ఆ సంగీతం ఎంతో సరసప్రాభవాన్ని పొందింది.

ఈ ప్రజా యుగంలో కళాకారునికి ప్రజలకూ గల అవినాభావ సంబంధాన్ని అవగాహన చేసుకున్న మనిషి శ్రీ రామారావు గారు. కళాకారుని జీవితం పరమార్థం ప్రజాశ్రేయస్సు మాత్రమే అని ఆయన గుర్తించడమే కాదు. తదనుగుణ్యంగా ఆచరిస్తూ ఉన్న కార్యదక్షుడు. సోదర ప్రజల కష్టనిష్టురాలకు తత్పానుభూతిగా స్పందించే హృదయం.

దేశపాశంకోసం, ప్రజాహితంకోసం ఆయన నిర్వహించిన కార్యకలాపాలు ఆయన మహనీయతకు తార్మాణాలు, ఆయన సహచరులందరూ,ఆయన కార్యదక్షతను, క్రమశిక్షణకు, హృదయావ్రతకు వినతులు కాకుండా ఉండలేదు. ఆయన సహజ యశోపద్మశ్రీ విభూషితులు శ్రీ రామారావు గారు ప్రజా హృదయాభిరామునిగా చిరంజీవిగా వర్ధిల్లగలందుకు పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నారు.

Related posts