telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికర వీడియోను షేర్ చేసిన మెగా హీరో

Saitej

టాలీవుడ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా ఉంది. “ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ విజయానికి దారి ఉంటుంది” అని పేర్కొన్న ఈ పోస్టును సాయి ధరమ్‌ తేజ్‌ రీట్వీట్‌ చేశారు. ముందుగా వండర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఈ వీడియోను షేర్‌ చేసింది. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి చిన్న జీవి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనే క్యాప్షన్‌తో తన ట్విటర్‌ అకౌంట్లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఒక చిన్న పురుగు రెండు బల్లల మధ్యలో దాని పరిమాణం అంతే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని దాటేందుకు ఎలా కృషి చేసిందో ఈ వీడియోలో తెలుస్తోంది. కాగా దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.

Related posts