telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరీంనగర్ గడ్డమీద పుట్టడం అదృష్టం…

బిగ్ బాస్ సీజన్- 4 ఫేమ్ సోహెల్ తన సొంత జిల్లా కరీంనగర్‌పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కరీంనగర్ కార్కానగడ్డ అని… కరీంనగర్ గడ్డమీద పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని సోహెల్‌ పేర్కొన్నాడు. కెరీర్‌ కోసం ఎంతో కష్టపడ్డానని, అందరి సహకారంతో తగిన గుర్తింపు లభించిందన్నాడు. పదేళ్ళ శ్రమకు ఫలితమే బిగ్ బాస్ అని… తాను నటించిన సినిమా పేరు త్వరలేనే ప్రకటిస్తానని పేర్కొన్నాడు. కరీంనగర్ లో సినిమా తీయాలనుకుంటున్నానని.. సింగరేణిలో ప్రమాదాలపై త్వరలో ఓ సినిమా తీస్తానని స్పష్టం చేశాడు సోహెల్. వందరోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండడం వల్ల తల్లిదండ్రుల విలువ ఎందో తెలుసున్నానని.. ఉన్నదాంట్లో సర్దుకోవాలని నేర్చుకున్నానని తెలిపాడు. జీవితంలో ఫ్రెండ్స్ కు విలువ ఇవ్వాలని.. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశాడు సోహెల్. కాగా.. బిగ్ బాస్- లో సోహెల్ 25 లక్షలు తీసుకుని హౌజ్‌ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.. 

Related posts