telugu navyamedia
సినిమా వార్తలు

జమున ‘బొబ్బిలి యుద్ధం’ లో అందుకే నటించనంది.

ఎన్.టి.రామారావు, భానుమతి, ఎస్ . వి .రంగారావు, జమున నటించిన గొప్ప చారిత్రిక సినిమా ‘బొబ్బిలి యుద్ధం’.

1757 వ సంవత్రంలో బొబ్బిలి సంస్థానం, ఫ్రెంచి మరియు విజయనగర సంస్థానంకు మధ్యన జరిగిన పోరాటమే బొబ్బిలి యుద్ధం.1964లో ఈ సినిమాను సి. సీతారాం సినిమాగా తీయాలని సంకల్పించుకున్నాడు.

రంగారాయుడు పాత్రకు రామారావును, మల్లమ్మ పాత్రకు భానుమతిని, తాండ్ర పాపారాయుడు పాత్రకు ఎస్.వి . రంగారావు గారిని ఎంపిక చేశారు. వెంగళరాయుడు పాత్రను తానె ధరించాలని అనుకున్నాడు. తన మరదలి పాత్ర శుభద్ర కోసం జమునను సంప్రదించాడు. అయితే ‘సీతారాం కోతిలా ఉంటాడు అతని ప్రక్కన నేను హీరోయిన్ గా చెయ్యను’ అని చెప్పేసింది. సీతారాం అటువంటి సమాధానం వస్తుందని ఊహించలేదు .

బొబ్బిలి యుద్ధం సినిమాకు ఆయనే నిర్మాత, దర్శకుడు, పైగా చారిత్రిక సినిమా. చాలా వ్యయ, ప్రయాసలతో నిర్మించాలి. నిజానికి జమున అంటే సీతారాంకు ఎంతో అభిమానం . అప్పుడు జమున వయసు 28 సంవత్సరాలు. నిండైన విగ్రహం, మంచి ఛాయ, చూడాగానే ఆకట్టుకొనే సొగసు. గ్లామర్ హీరోయిన్ అంటే జమునే అనేవారు. ఆమె అందం సీతారాం ను ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పాలి. జమున నటించనని చెప్పిన తరువాత సినిమా తీయడం అవసరమా ? అనుకున్నాడు. జమున తో నటించకపోతే. ఇక సినిమా రంగంలో ఎందుకు? అని మదనపడుతున్న సమయంలో ఆయనకు ఎవరో నిర్మాత డి.ఎల్. నారాయణ గారితో మాట్లాడమని చెప్పారు. డి.ఎల్. నారాయణ గారు జమున కుటుంబానికి సన్నిహితుడు .

డి.ఎల్. నారాయణ గారు జమునను, వారి నాన్న శ్రీనివాసరావు గారిని ఒప్పించారు. శృగార సన్నివేశాల్లో నటించేటప్పుడు కౌగిలి లాటివి ఉండకూడదు అని జమున ఆక్షలు విధించింది. అన్నింటికీ సీతారాం ఒప్పుకున్నాడు. అలా జమున ‘బొబ్బిలి యుద్ధం ‘ సినిమాలో సీతారాం పక్కన నటించింది. ఈ ఇద్దరి మీద మహా కవి శ్రీ శ్రీ వ్రాసిన, అందాల రాణివే, నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా, మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే అనే పాటలను ఘంటసాల, సుశీల గానం చెయ్యగా సాలూరి సాజేశ్వర రావు సంగీత దర్శకత్వం వహించారు.
“బొబ్బిలి యుద్ధం” సినిమా 04-12-1964 డిసెంబర్ 4న విడుదలై ఘనవిజయం సాధించింది. అలా సీతారామ్ జమునతో నటించి తన కోరిక తీర్చుకున్నాడు.

Related posts