telugu navyamedia
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని బాలయ్య పేర్కొన్నారు. 

కాగా.. గత రెండు రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు  చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆహాలో సక్సెస్ ఫుల్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’కు కూడా రెండో సీజన్ ప్రకటించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ  గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో #NBK107 వ సినిమా చేస్తున్నారు.  

అలాగే జూన్ 10వ తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related posts