telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎవరికి పుట్టడం అనేది వారి `కర్మ`… సోనమ్ ట్వీట్ వైరల్

Sonam-Kapoor

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ వారసులపై పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ విమర్శలకు సమాధానం ఇచ్చే క్రమంలో హీరోయిన్ సోనమ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. “ఎంతో కష్టపడి బాలీవుడ్‌లో ప్రముఖ హీరోగా ఎదిగిన వ్యక్తికి నేను కూతురిని. అందుకు ఎంతో గర్వపడుతున్నా. అవును.. నేను మా డాడీ కూతుర్ని. నేను ఈ స్థానానికి రావడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు. ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను. అది నాకు అవమానకరం కాదు. ఎక్కడ, ఎవరికి పుట్టడం అనేది వారి `కర్మ` మీద ఆధారపడి ఉంటుంది” అంటూ తన వారసత్వాన్ని సోనమ్ సమర్థించుకుంది. మీరు స్టార్ వారసులు అయినంత మాత్రాన మరొకరిని చులకనగా చూడకూడదు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Related posts