telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాధే శ్యామ్ : ఆ విషయంలో ఇంకా సస్పెన్స్…!!

Radheshyam

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రావడంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయంలో మాత్రం మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తున్నారు అన్నది ఇంకా తెలియరాలేదు. ఎన్నో అంశాలను వెల్లడించిన ఈ చిత్ర యూనిట్ ఈ ఒక్క అంశాన్ని మాత్రం ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. మరి ఈ భారీ చిత్రానికి ఎవరు సంగీతం అందించనున్నారో చూడాలి.

Related posts