telugu navyamedia
సినిమా వార్తలు

నో కామా.. నో ఫుల్‌స్టాప్..ఇప్ప‌డు బిగ్‌బాస్ అవుతుంది నాన్‌స్టాప్‌

తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటివరకు విజయవంతంగా 5 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ నుంచి ఈ గేమ్ షో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే..ఇప్పటివరకు బుల్లితెరపై సందడి చేసిన బిగ్​బాస్ ఇకపై 24/7 అలరించేందుకు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. బిగ్​బాస్​ నాన్​స్టాప్​ పేరుతో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో ఫిబ్రవరి 26నుంచి స్ట్రీమింగ్​ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో ఈ ప్రోమోలో వెన్నెల కిషోర్, నాగార్జున, మురళీశర్మ కనిపించారు. వెన్నెల కిషోర్ కు ఉరిశిక్ష పడటంతో అతడిని ఉరితీయడానికి తీసుకెళ్లిన సమయంలో చివరికోరిక ఏదైనా ఉందా అని అడగ్గా.. అతడి తరుపున లాయర్ అయిన నాగార్జున బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ చూస్తాడని చెప్పడంతో ఒక గంటలోనే అయిపోతుందనుకొని పోలీస్ ఆఫీసర్ అయిన మురళీశర్మ ఒప్పుకుంటాడు.. కానీ ఎంత సేపటికి బిగ్ బాస్ పూర్తవ్వదు.. ఇక ఆ ముగ్గురు షోనూ చూస్తూ ఉండిపోతారు. అలా వెన్నెల కిషోర్ ఉరి నుంచి తప్పించుకుంటాడు..

ఇక పై బిగ్ బాస్ ఇంటి నుంచే ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని నాగార్జున చివరిలో చెప్తాడు.. డిస్నీ ప్లస్ హాట్ బిగ్ బాస్ టెలికాస్ట్ కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్​ల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Related posts