telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైలెంట్‌గా ప్రియుడితో లేడి కమెడియన్ నిశ్చతార్ధం…!

Vidyullekha

లాక్‌డౌన్ వేళ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి పీటలెక్కుతూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలు తమ తమ ఇష్టసఖులను పెళ్లాడగా.. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కంప్లీట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది. ఇదే బాటలో లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ కూడా తన ప్రియుడితో రోకా వేడుకను సీక్రెట్‌గా ఫినిష్ చేసేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆగష్టు 26వ తేదీన తమ నిశ్చితార్థం జరిగినట్లు దాదాపు 5 రోజుల తర్వాత వెల్లడిస్తూ ప్రియుడితో దిగిన పిక్ షేర్ చేసింది విద్యుల్లేఖ రామన్. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొన్న ఆమె.. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పింది. మా నిశ్చితార్థం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని చెబుతూ విద్యుల్లేఖ పోస్ట్ పెట్టింది. ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో సైలెంట్‌గా నిశ్చితార్ధ కార్యక్రమాన్ని కానిచ్చేసింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. ఆమె పలు తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి హాస్యం పండించింది.

Related posts