telugu navyamedia
సినిమా వార్తలు

​ ‘రాధేశ్యామ్’​ నుంచి “సోచ్ లియా” సాంగ్ రిలీజ్‌

పాన్ ఇండియా హీరో ప్రభాస్​, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్ట‌ర్స్‌, విడియోలు, సాంగ్స్‌ ప్రేక్షకులను అభిమానులను వీప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రాధా కృష్ణ కుమార్ వరల్డ్ క్లాస్ ఫిల్మ్ గా తెరకెక్కించిన‌ చిత్రం లో ప్రభాస్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Soch Liya Lyrics – Radhe Shyam | Arijit Singh 2021

విడుదల తేదీ దగ్గరపడేకొద్ది వరుస అప్డేట్స్​ను ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా​ హిందీ వెర్షన్​లోని మరో పాట ‘సోచ్ ​లియా’ను విడుదల చేశారు. మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన అరిజిత్ సింగ్ పాడటం జరిగింది.

Radhe Shyam Soch Liya Song Teaser Out: Prabhas And Pooja Hegde Recreate The Most Romantic Song Of The Year

ఇందులోని విజువల్స్​ రిచ్​గా కనిపించడం సహా సినిమాపై అంచనాలను కూడా మరింతగా పెంచుతోంది. అంతకుముందు విడుదలైైన ‘ఆషికీ ఆగయి’ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. యూ వీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ఫ్యాన్స్‌లో భారీ అంచ‌నాలు మొద‌లైయ్యాయి.

Image

కాగా, ఈ మూవీలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

Related posts