telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుబ్బరాజుపై అభిమానంతో జపాన్ అమ్మాయిలు ఇలా… వీడియో వైరల్

Subbaraju

“బాహుబలి” చిత్రానికి, అందులో నటించిన నటులందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా జపాన్‌లో “బాహుబలి”కి వీరాభిమానులున్నారు. ఆ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, సుబ్బరాజు తదితరులకు అక్కడ అభిమానులేర్పడ్డారు. అక్కడి అభిమానులు సుబ్బ‌రాజుని ఎంత‌గానో అభిమానిస్తున్నారు. గ‌త ఏడాది ఆయ‌న బ‌ర్త్‌డేని వినూత్నంగా జ‌రిపారు. కేక్‌ను కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సుబ్బరాజు కార్టూన్‌ బొమ్మలతో కూడిన ఫోటోలను షేర్‌ చేశారు. అంతేకాకుండా బోలెడన్ని గిఫ్ట్‌లను సుబ్బరాజుకు పంపించారు. తాజాగా సుబ్బ‌రాజు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్నిఎంత‌గానో ఆద‌రించిన వారు వీడియో ద్వారా సుబ్బ‌రాజుకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న‌పై ఇంత ప్రేమ‌ని చూపిస్తున్న జ‌ప‌నీయులుకి ఆయ‌న‌ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts