telugu navyamedia
రాజకీయ

కుప్పకూలిక ఆర్మీ హెలికాప్టర్..

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌ ఎంఐ-17 హెలికాప్టర్‌ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ లో బిపిన్ రావత్ తోపాటు 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత‌ప‌డ్డారు. మృతదేహాలను వెల్లింగ్టన్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగాయపడినవారికి చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం హృద‌య‌విదార‌కంగా మారింది.

హెలికాప్టర్లో బిపిన్ రావత్ తోపాటు… ఆయన సతీమణి డిఫెన్స్ వైవ్స్ వెల్ఫేర్ ఆఫీసర్ మధులికా రావత్, ఆర్మీ అధికారులు బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్‌ (CDS స్పెషల్‌ ఆఫీసర్‌), లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌సింగ్‌ ( CDS స్పెషల్‌ ఆఫీసర్‌), నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌(పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), నాయక్‌ జితేందర్‌కుమార్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) , లాన్స్‌నాయక్‌ సాయితేజ ( పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) హవాల్దార్‌ సత్పాల్‌ ( పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) తదితరులున్నట్లు ప్రాథమిక సమాచారం.


ప్రమాద ఘటనతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతికి గురయ్యారు. రక్షణశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రమాద సమాచారాన్ని ప్రధానమంత్రికి వివరించారు. అత్యవసరంగా కేంద్రకేబినెట్ భేటీ అయింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించింది.

త్రివిధ దళాలను సమన్వయం చేస్తూ, భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి బిపిన్ రావత్ విశేష కృషి చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రావత్ రిటైరయ్యారు. ఆర్మీ అధినేతగా ఆయన అందించిన విశిష్ట సేవలపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన సేవలు దేశానికి ఇంకా ఎంతో అవసరం అని కేంద్రం భావించింది. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా కేంద్రం ప్రకటించింది.

త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా ఆయన వ్యవహరిస్తున్నారు. కార్గిల్ వార్ అనంతరం దేశ రక్షణ విధాల్లో లోపాలను పరిశీలించేందుకు CDS పదవి తెరపైకి వచ్చింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా CDS వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయనకు సైనిక పరమైన అధికారాలు ఉండవు. విడివిడిగా సైన్యం, నౌకాదళం, వాయుసేనలకు ఆయా దళాల అధిపతులే నాయకత్వం వహిస్తారు. సైబర్‌, అంతరిక్ష విభాగాలు CDS కనుసన్నల్లోనే పనిచేస్తుంది. NCA కు ఆయన సైనిక సలహాదారుగా ఉన్నారు. రక్షణ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు.

IAF Helicopter Crash Live Updates: Chopper with CDS Bipin Rawat on board crashes in Ooty; 7 dead, rescue operations on

హెలికాప్టర్‌ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదస్థలిని సందర్శించేందుకు బయలుదేరివెళ్లారు.

Related posts