దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేస్తూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తోంది చిత్రబృందం.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ సినిమా నుంచి హీరోలకు సంబంధించిన మరో పవర్ ప్యాక్డ్ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరెండు ప్రోమోలు ట్రెండ్ అవుతున్నాయి.
మంగళవారం ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ అల్లూరి సీతారామరాజు వీడియోను రామ్‌చరణ్‌కు(రామ్ పాత్ర) సంబంధించిన గ్లింప్స్‌ను ఎన్టీఆర్ విడుదల చేయగా.. నేడు (బుధవారం) ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్’ అనే క్యాప్షన్ తో తారక్‌కు(కొమురం భీమ్) సంబంధించిన మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు చరణ్.
ఈ సినిమాలో అజయ్‌దేవగణ్, శ్రియ, ఆలియాభట్ , ఒలివియా మోరిస్, సముద్రఖని, కూడా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది .ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమాను ఘనంగా విడుదల చేయనున్నారు.