telugu navyamedia
సినిమా వార్తలు

‘గాడ్ ఫాద‌ర్’ తల్లిగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్ కూడా మొద‌లు పెట్టాడు చిరు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్‌గా రూపొంతుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీ లో జరుగుతుంది.

థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. గాడ్ ఫాద‌ర్ చిత్రంలో చిరంజీవికి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌లో న‌టించి మెప్పించిన గంగవ్వ‌, గాడ్ ఫాద‌ర్ ,చిత్రంలో తల్లిగా నటించే వార్త నిజమైతే ఆమెకి లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు.

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్‌.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts