telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెప్టెంబ‌ర్ 6న బిగ్ బాస్-4 ప్రారంభం

Bigg-Boss-4

తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 4 సంద‌డి షురూ కానుంది. బిగ్ బాస్ 4 ప్రారంభానికి అంతా రెడీ అయింది. సెప్టెంబ‌ర్ 6న సాయంత్రం 6 గంట‌ల‌కు బిగ్ బాస్ షో ప్రసారం కానున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. బిగ్ బాస్-4లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో ప‌లువురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో యాంకర్లు లాస్య, అరియానా, జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, గాయ‌కుడు నోయల్‌ సేన్‌, టీవీ-9 దేవి, కొరియోగ్రాఫ‌ర్ రఘు, అతని భార్య ప్రణవి(గాయ‌ని), గంగవ్వ, న‌టీమ‌ణులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడతోపాటు యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే కంటెస్టంట్లుగా అల‌రించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ జాబితాలో ఉన్న వారిపై బిగ్ బాస్ టీం స్ప‌ష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక కరోనాకు సంబంధించిన జాగ్రత్తులు తీసుకుంటూ ఈ షో చేయనున్నారు.

Related posts