ఆర్టీసీ కార్మికుల సమ్మె పై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కార్మికులు తక్షణమే దిగిరావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు.
ఆర్టీసీ యూనియన్ల నాయకులే ఆర్టీసీని ముంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీకి భారీ నష్టాలు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చిపంథాలో సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదని మరోసారి సీఎం స్పష్టం చేశారు.
రాష్ర్టాభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి