telugu navyamedia
సినిమా వార్తలు

మరో వ్యాపారంలోకి అడుగు పెడుతున్న మహేష్ బాబు

Mahesh-Babu

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్ప‌టికే ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. గ‌చ్చిబౌలిలో అధునాత‌న సౌక‌ర్యాల‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం జ‌రుపుకోగా, ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీతో 7 స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక తాజాగా దుస్తుల బిజినెస్ ప్రారంభించేందుకు మ‌హేష్ సన్నాహాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కొద్ది సేప‌టి క్రితం టీమ్ మ‌హేష్ బాబు ట్విట్టర్‌లో… http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్ లింక్‌ని షేర్ చేస్తూ..మీ ఆశీర్వాదంతోనే అంతా జ‌రుగుతుంది. మిమ్మ‌ల్ని ఆశ్చర్య‌ప‌ర‌చే ఓ విష‌యం మేము షేర్ చేసుకుంటున్నాం. దీనిపైనే ప్ర‌స్తుతం వ‌ర్క్ జ‌రుగుతుంది. ఆ సీక్రెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండ‌ని కామెంట్ రాశారు. దీనిని మ‌హేష్ బాబు రీ ట్వీట్ చేశారు. ఇది ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ కాగా, మ‌రో రెండు రోజుల‌లో ప్రారంభం కానుంది, ప్ర‌స్తుతం కౌంట్ డౌన్ న‌డుస్తుంది. ఇందులో లాగిన్ అయితే మ‌హేష్‌ని క‌లిసే ఛాన్స్ కూడా పొంద‌వ‌చ్చు అని తెలిపారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Related posts