ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లోని మొదటిరోజు హోరాహోరీగా సాగిన పోరులో తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటేశారు భారత సీనియర్ ప్లేయర్లు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత పదో ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ మెగా ఈవెంట్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17-21, 21-16, 21-6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై… సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21-17, 21-16తో 66వ ర్యాంకర్ జాసన్ ఆంథోని హో-షుయె (కెనడా)పై… ప్రణయ్ 59 నిమిషాల్లో 17-21, 21-10, 21-11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్‌లాండ్)పై విజయం సాధించారు.
గత ప్రపంచ చాంపియన్‌షిప్ శ్రీకాంత్ రెండు గేమ్‌లు గెలుచుకోగా… ఈసారి మూడు గేమ్‌లు మాత్రమే గెలిచాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17-16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ వరుసగా 4 పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. తొలి పాయింట్ కోల్పోయాక శ్రీకాంత్ స్మాష్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11-1తో ఆధిక్యంలోకి దూసుకుపోయి వెనుదిరిగి చూడలేదు.
అక్రమ సంబంధాలు సాధారణమే… దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు