telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

బాడీ స్ప్రేలు వాడుతున్నారా.. !

ప్రస్తుతం కాలంలో చాలా మంది ఎక్కువగా బాడీ స్ప్రేలను, ఫర్‌ఫ్యూమ్‌లను బాగా వాడుతుంటారు. ఇక ఫంక్షన్లు వస్తే… వీటికి హద్దు అదుపు ఉండదు. అయితే.. ఇవి వాడటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ డియోడ్రెంట్స్‌, ఫర్‌ఫ్యూమ్స్‌ అండర్‌ ఆర్మ్స్‌ కొట్టడం చూస్తుంటాం. ఆడవారిలో ఇది వక్షోజాలకి దగ్గరిగా ఉండటం వలన స్ప్రే చేసుకున్నప్పుడు ఈ ప్రభావం బ్రెస్ట్‌ టిష్యూలపై కూడా పడుతుంది. ఆ విధంగా ఆడవాళ్లకి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందట. అలాగే వక్షోజాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం వాడే బాడీ స్ప్రేలో ఎక్కువగా ఎథనాల్‌ ఉండటం వల్ల అది చర్మాన్ని పొడిగా ఉంచుతుంది. అలాగే ఫర్‌ఫ్యూమ్స్‌ని తయారు చేయడానికి వాటిలో రకరకాల కెమికల్స్‌ను కలపడం చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వీటికి దూరంగా ఉంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి క్షేమం. కాబట్టి బాడీ స్ప్రేలను, ఫర్‌ఫ్యూమ్‌లను వాడకపోవడం చాలా మంచిది.

Related posts