బిగ్‌బాస్ షో సందడి ప్రారంభం అయ్యింది. అయితే కంటెస్టెంట్స్ అందరిలో గంగవ్వే పాపులర్ అవుతోంది. మొదటి వారంలోనే అందరూ కలిసి ఆమెను ఎలిమినేషన్ రౌండ్‌కు పంపించారు. అయితే షో ప్రారంభమైన నాటి నుంచి కొనసాగుతున్న అర్థం పర్థం లేని ఏడుపులను ప్రేక్షకులు భరించలేకపోతున్నారు. ముఖ్యంగా మిస్ గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ అందరినీ దాటి కన్నీటి కిరీటాన్ని అందుకునేలా ఉంది. మొదటి సీజన్‌లో సింగర్ మధుప్రియ, రెండో సీజన్‌లో దీప్తి సునయన, మూడో సీజన్‌లో శివజ్యోతి ఏడవటానికే వచ్చారన్నట్లుగా ప్రతీదానికి ఏడుస్తూనే సమాధానం చెప్పేవాళ్లు. ఈసారి వారి స్థానాన్ని మోనాల్ గజ్జర్ భర్తీ చేసింది. ఏదేమైనా రోజుకు ఒక్కసారైనా ఏడవటం పక్కా. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైన మొదటి రోజే తన కుటుంబం, తండ్రి గురించి చెప్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది. రెండో రోజు వెజ్, నాన్‌వెజ్ సెపరేట్‌గా వండమని కోరగానే, మరో మాట చెప్పకుండా అందరూ ఓకే అన్నారు. అయినా సరే మళ్లీ ఏడుస్తూ చెప్పిందే చెప్పి అందరికీ విసుగు తెప్పించింది. ఎప్పుడు చూసినా మోనాల్ ఏడుస్తూనే ఫుటేజీ దక్కించుకుంటోంది. దీంతో పాతాళగంగ బిరుదు సంపాదించుకున్న శివజ్యోతిని మోనాల్ మించిపోయిందని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ నడుస్తున్నాయి. పైగా హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతోంది.
previous post
next post
ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ అవసరమా ?