తెలంగాణ విద్యుత్ శాఖ (TSSPDCL)లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబరు 10న విడుదల కానుంది. అక్టోబరు 10 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. మొత్తం ఖాళీల్లో జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500 ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
పోస్టులు పోస్టులు
జూనియర్ లైన్ మెన్ 2500
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 25
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500
మొత్తం పోస్టులు 3,025
ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!