telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీల కోసం కొత్త పథకం ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’

J

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం వైసీపీ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దసరా పండుగ సందర్భంగా ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయిల ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. వారిలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్‌, పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు.. ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు లభిస్తున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలని సీఎం జగన్ అన్నారు. ఎవరి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే ఉద్దేశంతోనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సచివాలయాల్లో కూడా 82 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయని గుర్తు చేశారు. అలాగే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ఉద్యోగుల వెల్ఫేర్ సంఘము మరియు ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆప్ కామర్స్ ఇండస్ట్రీ, ఏపీ కో ఆర్డినేటర్ మల్లి భాస్కరరావు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ “జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం” ప్రోగ్రామును ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ప్రోగ్రాములో గిరిజనుల తరపున నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గౌతమ్ రెడ్డి గారు,శ్రీ బాలినేని వాసు గారు, P. విశ్వరూప్ గారు శ్రీమతి వనిత గారు, Apiic చైర్మన్ శ్రీమతి రోజా గారు, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు శ్రీ నందిగాo సురేష్ గారు SC STలకు చెందిన అందరు శాసన సభ్యులు సీనియర్ IAS అధికారులు, నేను పాల్గొన్నాము” అని తెలిపారు.

J

Related posts