telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షర్మిల ఖమ్మం సభకు పోలీసుల అనుమతి…

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారు అని సమాచారం. పార్టీ జెండా, సిద్ధాంతాలను కూడా అదే రోజున ప్రకటించే అవకాశం ఉన్నది. 2023 ఎన్నికలే లక్ష్యంగా షర్మిల పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉన్నది. ఇక షర్మిల ఖమ్మం సభకు పోలీసుల అనుమతి ఇచ్చారు. ఏప్రిల్ 9న సభకు అనుమతి ఇచ్చారు ఖమ్మం పోలీసులు. కోవిడ్ నిబంధనలతో సభకు అనుమతి ఇచ్చారు. శానిటైజర్లు, మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీసులు ఆదేశించారు. లక్ష మందితో సభ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు షర్మిల అనుచరులు. ఇక తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని వైఎస్సార్ కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలాగే. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఖమ్మం నేతలతో చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని కొండా రాఘవ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts