telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దగ్గుబాటి రానా పెళ్ళి పత్రిక… అంతా ఫేక్…!!

ఈ ఏడాది మే 12న రానా తన ప్రేమసి మిహీకా బజాజ్‌ను సోషల్ మీడియా ద్వారా రానా పరిచయం చేశారు. మిహీకాతో తన వివాహాన్ని ఖరారు చేస్తూ మే 21న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో రోకా ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో దగ్గుబాటి, బజాజ్ ఫ్యామిలీలు పాల్గొన్నాయి. ఈ వేడుక అయిన తరవాత రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం జరగనున్నట్లు చెప్పారు. కాగా దగ్గుబాటి వారి పెండ్లి పిలుపు వీడియో శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ‘మాయాబజార్’ సినిమాలోని ఒక సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను రూపొందించారు. నిజానికి ఈ ఇన్విటేషన్ చాలా బాగుంది. కానీ, ఇది దగ్గుబాటి వారు అధికారికంగా విడుదల చేసిన ఇన్విటేషన్ వీడియో కాదని ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ వీడియోను ఫ్యాన్స్ తయారుచేశారని తెలుస్తోంది. ఆ వీడియోలో ఉన్న వేదిక, సమయం కూడా తప్పు అని దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలను త్వరలోనే దగ్గుబాటి కుటుంబం ప్రకటించనుంది.

Related posts