telugu navyamedia
సినిమా వార్తలు

‘అవతార్’కి మించిన‌ ‘లడకీ’ : రామ్ గోపాల్ వర్మ పై విజయేంద్రప్రసాద్ ప్రశంసలు

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో.. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ అనేది టైటిల్. చైనీస్ భాషలో విడుదల చేయాలని ఈ సినిమాను రూపొందించారు. దానిని హిందీలో ‘లడకీ’ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి ‘అమ్మాయి’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను జూలై 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 47 వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దర్శకులు ఎమ్‌ఎమ్‌ కీరవాణి హజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పది నెలల క్రితం కనబడుట లేదు మూవీ ఆడియో ఫంక్షన్‌కు తనని అతిగా పిలిచారని, అదే కార్యక్రమానికి వర్మ కూడా వచ్చాడన్నారు. ఆ సందర్భంగా దాదాపు 15 ఏళ్ల పాటు వర్మపై తనలో గూడుకట్టుకంటున్న కోపం, చిరాకు, బాధ, అసహ్యం అన్ని కలిపి ఆరోజు ఒక్కసారిగా బయటకు తీశానన్నారు.

‘శివ సినమా చూశా. ఎంతో స్ఫూర్తి పొందా. వందల మంది రచయితలు, డైరెక్టర్లు, టెక్నిషియన్లు వర్మ వల్ల ప్రేరణ పొంది ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకు కనిపిస్తే చెప్పండి మళ్లీ శివ లాంటి సినిమా తీయమని’’ అన్నాను అని గుర్తు చేసుకున్నారు .

అయితే ఆ రోజు ఇలా అనొచ్చో లేదో కానీ నాలోని ఆవేశం అలా అనిపించేలా చేసింది. కానీ ఇప్పుడు అమ్మాయి సినిమా చూస్తుంటే నాకు శివ నాటి వర్మ మళ్లీ కనిపించారు. ఇప్పుడు గర్వం చెబుతున్నా.. వర్మ గారు మీలో ఆనాటి డైరెక్టర్‌ నాకు మళ్లీ కనిపించారు. శివ కంటే వంద రెట్లు ఎక్కువగా కనిపించారు. ఈ సినిమా 40వేల థియేటర్లో విడుదలవ్వడమంటే సాధారణ విషయం కాదు. నిజంగా ఇది అద్భుతమైన విషయం. ఈ ఘనత ఇప్పటి వరకూ ఎవరు సాధించలేదు. మన తెలుగు వారందరికి ఇది గర్వకారణం’ అంటూ వర్మను కొనియాడారు.

Related posts