telugu navyamedia
సినిమా వార్తలు

విక్రమ్ 58వ చిత్రం… 25 గెటప్పులలో…!

Vikram

విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో విక్రమ్ త‌న 58వ చిత్రాన్ని అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 4 శుక్ర‌వారం సెట్స్ పైకి వెళుతుంద‌ని దర్శకనిర్మతలు ప్ర‌క‌టించారు. ఏప్రిల్‌ 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్ర‌మ్ దాదాపు 25 గెట‌ప్స్ పోషించ‌నున్నాడ‌ట‌. క‌మల్ హాస‌న్ త‌ర్వాత మ‌ళ్లీ అన్నీ పాత్ర‌ల‌ని విక్రమ్ పోషించ‌నున్నాడు. ఇప్ప‌టికే అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆయన మేకప్‌, గెటప్‌లకు డిజైన్లు రెడీ చేస్తోందని స‌మాచారం. ఇది పాన్‌ ఇండియా సినిమా. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తాం. వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ టెక్నీషియన్లు ఇందుకోసం పనిచేయనున్నారు అని 7స్క్రీన్‌ స్టూడియోస్ ఇటీవ‌ల తెలిపింది. ఈ సినిమా గురించి విక్రమ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts