telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రేపు విడుదల కానున్న నితిన్ కొత్త సినిమా టైటిల్…

నితిన్ ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేసాడు. అందులో చెక్ అభిమానులను మేపించలేకపోయిన రంగ్ దే మాత్రం పర్వాలేదు అనిపించింది. అయితే ప్రస్తుతం అతను బాలీవుడ్ లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. నితిన్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీలో రాధికా ఆప్టే పోసించిన పాత్ర‌లో న‌భాన‌టేశ్ క‌నిపించ‌నుండ‌గా.. ట‌బు రోల్ లో త‌మ‌న్నా న‌టిస్తోంది. ఠాగూర్ మ‌ధు, నితిన్ హోం బ్యాన‌ర్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించ‌నున్నాయి. అయితే ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ స్టార్ అయినట్లుగా నితిన్ ట్వీట్ ద్వారా తెలియపరిచారు. నితిన్ కి ఇది 30వ సినిమా. అయితే ఈ సినిమా తెలుగు టైటిల్ ను ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ రేపు నితిన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ తెలిపింది. అయితే వ‌చ్చే మార్చి వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేశాడు. మెర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

Related posts