ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిరోముండనం ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. వీటిని ఉద్దేశిస్తూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ నేత చినరాజప్ప ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎస్సీల హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ నేత చినరాజప్ప ఆరోపించారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీకి అంత భారీగా సీట్లిచ్చిన ఎస్సీలపై దమనకాండ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. జగన్‌కు ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తోందని ఆయన అన్నారు