telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైకిల్‌ తొక్కుతున్న సమంత…ఫోటో వైరల్‌

అక్కినేని సమంత తన హస్బెండ్ నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ కు ప్రముఖ పర్యాటక కేంద్రం మాల్దీవులు వెళ్ళింది. అక్కినేని నాగచైతన్య సైతం అక్కడే ఉన్నారని సమాచారం. ప్రస్తుతం సెలెబ్రిటీలకు వెకేషన్ అంటే ఒక్కటే స్పాట్ మాల్దీవులు.. వరుసబెట్టి మన తారలందరూ అక్కడికే వెళ్తున్నారు. తాప్సీ తన సోదరి, ఫ్రెండ్‌తో కలిసి మాల్దీవుల్లోనే ఎంజాయ్ చేసింది. మరో వైపు కాజల్ తన హనీమూన్‌ను సైతం అక్కడే ప్లాన్ చేసుకుంది. ఇక ప్రస్తుతం రకుల్ చేసే హంగామా వైరల్ అవుతోంది. బీచ్‌లో బికినీలు, సముద్రపు ఒడ్డున యోగాసానాలు, ఫ్యామిలీతో కలిసి డిన్నర్లు అంటూ మాల్దీవుల్లో రకుల్ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ రోజు నాగచైతన్య జన్మదినోత్సవం… ఈ నేపథ్యంలో బర్త్ డే వెకేషన్ కోసం వీరిద్దరూ మాల్దీవులకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే… అక్కడ ఎంజాయ్‌ చేస్తుంది సమంత.. ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో సమంత సైకిల్‌ పట్టుకుని కన్పిస్తోంది. ఆ ఫోటోలో పింక్‌ డ్రెస్‌ వేసుకుని.. ఓ టోపీ పెట్టుకుని చిన్న స్మైల్‌ ఇస్తోంది సమంత. దీంతో ఆ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related posts