telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క శర్మ మేకప్ ఆర్టిస్ట్ మృతి

Anushka

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. పెళ్ళి తరువాత కూడా బికినీ ధరించిన హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనుష్కశర్మ దగ్గర పనిచేసే మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ వాంగల్ ఉరఫ్ సుబ్బూ కన్నుమూశారు. ఈ విషయాన్ని అనుష్కశర్మ ఎంతో భావోద్వేగంతో కూడిన ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. దానిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీనితో పాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. అనుష్క తన పోస్టులో… “అతను ఎంతో దయాగుణం కలవాడు. వినమ్రతతో మెలిగేవాడు. ఎంతో ఉత్సాహంతో పనిచేసేవాడు. నేను ప్రేమతో సిద్దార్థను ‘మేస్ట్రో’ అని పిలుస్తుంటాను. తన స్కిల్స్‌తో నన్ను ఎంతో అందంగా తీర్చిదిద్దేవాడు. ఈ రోజు ఒక పవిత్ర ఆత్మ మనల్ని వీడిపోయింది. భగవంతుడు అతని ఆత్మకు శాంతినివ్వాలి” అని పేర్కొంది. కాగా 2019లో అనుష్కశర్మ సినిమా ఒక్కటి కూడా రాలేదు. ప్రస్తుతం ఆమె మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.

Related posts