విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్3’… అనిల్ రావిపూడి దర్శకత్వంలో. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూడో సాంగ్‌ను వదిలారు.
‘‘హాత్ మే పైసా… మూతి మే సీసా…పోరితో సల్సా… రాతిరంతా జల్సా.. అధ్యక్షా… లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఇందులో వెంకటేశ్, వరుణ్ పోటీగా స్టెప్పులేయగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
మొత్తంగా ఈ పాట కుర్రకారుని ఉర్రూతలూగించేలా ఉంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. పార్టీ సాంగ్స్‌లో ఇకపై ఈ పాట మారుమోగనుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
ఈ హీరోయిన్ తో కలిసి నటిస్తే చనిపోతున్నారట…!?