telugu navyamedia
క్రైమ్ వార్తలు

ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు సజీవ దహనం

*ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..
* టైర్ పేలి..లారీని ఢికొన్న‌కారు..కారులో మంటలు..

*ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సజీవ దహనం..

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ప్రకాశం జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో ..కారు కంట్రోల్ త‌ప్పి లారీని ఢీకొట్టింది.

దీంతో కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో ఈ ఘటన జరిగింది.

మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లా బాకరావుపేటకి చెందిన తేజగా గుర్తించారు. ఘటనా స్థలంలో లారీని వదిలి డ్రైవర్‌, క్లీనర్‌ పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Related posts