telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు రోజా.. పెళ్లి చేయమన్న వృద్ధుడు..

ఏపీలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో తీసుకుని వెళ్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పర్యాటక మంత్రి రోజా కూడా చిత్తూరు జిల్లాలోని నగరిలో ప‌ర్య‌టించారు. అయితే అక్క‌డ మంత్రి రోజా వింత అనుభ‌వం ఎదురైంది. అది కూడా త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆ అనుభ‌వం ఎదురుకావ‌డంతో ఆమె అవాక్క‌య్యారు.

వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రోజా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో ఓ వృద్ధుడితో మంత్రి రోజా మాట్లాడారు. మీకు ఫించ‌న్ వ‌స్తుందా లేదా ? అని అడిగారు.

త‌న‌కు నెల‌నెలా ఫించ‌న్ వ‌స్తుంద‌ని కానీ.. నీడ, తోడు లేదంటూ మంత్రికి చెప్పాడు. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా మంత్రి రోజానే అడిగాడు. అయితే.. వృద్ధుడి కోరిక విని మంత్రి రోజా న‌వ్వేశారు. పెన్షన్ అయితే ఎలాగోలా ఇప్పిస్తాం.. కానీ పెళ్లి చేయలేమంటూ మంత్రి రోజా వృద్ధుడితో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘటన పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుపై రోజా ప్ర‌తి ఇంటికి వెళుతూ అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

Related posts