telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దీదీ వ్యాఖ్యలతో ..ఏపీ రాజ‌కీయాల్లో పెగాస‌స్ దుమారం..

*ఏపీ రాజ‌కీయాల్లోపెగాసెస్  దుమారం..
*పెగాసెస్  పై మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్
*మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌ను ఖండించిన నారా లోకేష్‌..

ఏపీ పాలిటిక్స్‌లో పెగాసస్ స్పై వేర్ కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్స్‌ సంచలనంగా మారాయి.

అయితే  మమత బెనర్జీ చేసిన ఆరోపణలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఖండించారు. పెగాసెస్ సాప్ట్ వేర్ ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు.. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు.. నిజంగానే పెగాసెస్ సాఫ్ట్ వేర్ మేం కొనుగోలు చేసివుంటే వైఎస్‌ జగన్ అధికారంలోకే వచ్చేవారా..? మాపై చర్యలు తీసుకోకుండా జగన్ మూడేళ్లపాటు ఆగి ఉండేవారా..? అని ప్రశ్నించారు నారా లోకేష్‌.

కానీ, టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ నిజంగానే చెప్పిఉంటే.. ఆమెకు తప్పుడు సమాచారం అందిఉండొచ్చని వ్యాఖ్యానించారు..

పెగాసెస్  పై మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్..

ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని మమత బెనర్జీ ఆరోపించారు. ఆమె బెంగాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్‌ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్‌ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు.

 పెగాసస్ సాఫ్ట్ వేర్ ను 25 కోట్ల రూపాయలకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని మమత బెనర్జీ చెప్పారు. అయితే తాను తిరస్కరిచండంతో ఆ సాఫ్ట్ వేర్ ను ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీ ఆరోపించారు.

 

Related posts