telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల..

ఏపీ ప్ర‌భుత్వం  ‘జగనన్న చేదోడు’ పథకం కింద కులవృత్తుల్లో ఉన్న బీసీలకు వారి ఖాతాల్లో రెండో ఏడాది నగదు జమ చేశారు.

రజకులు, నాయూబ్రాహ్మణులు, దర్జీల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున  ఆర్థిక సాయం విడుదల చేశారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేశామని తెలిపారు.

జగనన్న చేదోడు కింద ఏటా ప్ర‌భుత్వం…షాపులున్న 1,46,103 మంది టైలర్లుకు రూ. 146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్ల సాయం అందిస్తున్నామని తెలిపారు.

తాజాగా విడుదల చేస్తున్న రెండో విడత నగదుతో కలిపి.. ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద ప్రభుత్వం 583 కోట్లు విడుదల చేసినట్లు అయిందని తెలిపారు..

సంక్షేమ పథకాల అమలులో లంచాలు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం. సాయం పేరుతో నాణ్యత లేని పరికరాలు ఇచ్చారని.. అంతేకాకుండా కమీషన్లు కూడా దండుకున్నారన్నారు.

Related posts