telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి పై .. ఏపీసీఎం కీలక ప్రకటన..

ఏపీ రాజధానిపై దుష్ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఈ అంశంపై పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం జనాల్లో ఆందోళనను పెంచింది. అయితే, ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజు ఈ అంశంపై జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సీఆర్డీఏ అధికారులతో జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం మనసులో ఏముందనే విషయం ఈరోజు బహిర్గతంకానుంది. రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. మరోవైపు, రాజధానిని మార్చకూడదని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts