telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు సలహా పాటించటానికి సిద్ధంగా ఉన్నా : పేర్ని నాని

perni Nani ycp

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితులపై కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రంగాల నుంచి ఆక్సిజన్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని.. చంద్రబాబు తగిన సలహా ఇస్తే పాటించటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల్లో ఇప్పుడు భయం తక్కువగా ఉండటం దురదృష్టకరమని..కరోనా గతంలో కంటే ఇప్పుడు ఊపిరితిత్తుల పై ఎక్కువ ప్రభావం చూపిస్తోందన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నామని.. బాధ్యత గల నాయకుడిగా చంద్రబాబు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పగలు, రాత్రి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని.. ఆక్సిజన్, బెడ్ల కొరత కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయా? అని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత పెరిగింది… రూపం మారింది.. హాస్పిటల్స్ లో సామర్థ్యం కంటే ఎక్కువ మంది పేషెంట్లకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Related posts