telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ జిల్లాకు నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ హైదరాబాద్ జిల్లాకు నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు శుక్రవారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ గారిని కమిషనర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముషీరాబాద్ – నాంపల్లి నియోజక వర్గాలకు నియమించిన సుబోద్ సింగ్ IRS (C&CE), మలక్ పేట్ – అంబర్ పేట్ నియోజకవర్గాలకు నియమించిన లక్ష్మి కాంత దాసప్ప IRS (C&CE), కార్వాన్ – గోషామహల్ నియోజకవర్గాలకు నియమించిన ధనుంజయ్ సింగ్ IDAS లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా లో తీసుకున్న చర్యల పై వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీస్ తనిఖీలు చెక్ పోస్టుల ఏర్పాటు చేసి నిఘా బృందాలు 24 గంటల పాటు పని చేసే విధంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ లు కలిసి ఇప్పటి వరకు 46 కోట్ల 34 లక్షల రూపాయలు పట్టుకోవడం జరిగిందని, ఈ రోజు 93 లక్షల 62 వేల రూపాయలు పట్టుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన సొమ్మును అభ్యర్థి, రాజకీయ పార్టీల ప్రమేయం లేని నగదు, ఆభరణాలు ఉన్న పక్షంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా ఫిర్యాదు కమిటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇప్పటి వరకు 27.47 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.

ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీ లక్ష్మి కాంత దాసప్ప జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం 7వ అంతస్తులో కమాండ్ కంట్రోల్ రూం లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, మద్యం షాపులు వద్ద సిసి కెమెరాల ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు జీపీఎస్ సిస్టం ద్వారా సిసి కెమెరాల ద్వారా ఎన్నికల వ్యయ పరిశీలకులకు ఈ.వీ.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి వివరించారు. అంతే కాకుండా ఈవీడిఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఎం సి ఎం సి, సువిధ, ఎం సి సి కంట్రోల్ రూం లను పరిశీలించారు. ఎం.సి.ఎం.సి పని తీరును కూడా సీపీఆర్ఓ ను అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూం లో ఎంసీసి కి సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా అని అనురాధ ను అడిగి తీసుకున్నారు. రిజిస్టర్ ను కూడా పరిశీలించారు.

ఆయన వెంట ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ ఎస్ పి శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎస్ పి సుదర్శన్, సి ఐ బాల్ రెడ్డి, విజయ ఆదిత్య, అమృత రెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శరత్ చంద్ర, సిపిఆర్ఓ మహమ్మద్ ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

Related posts