telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారు…

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 28న ఆమె వివాహం జరగనుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ, మర్రెడ్డి దంపతులు కుమారుడు చరణ్‌రెడ్డితో ఆమె వివాహ జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయం చరణ్‌రెడ్డి, ప్రత్యూష పెళ్లికి వేదిక కానుంది. ఇక, చరణ్, ప్రత్యూషల నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్‌లో విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుడు చరణ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా, పినతల్లి చేతుల్లో వేధింపులతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి చలించిపోయిన సీఎం కేసీఆర్ ప్రత్యుషను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు.

దీంతో ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు పర్యవేక్షణలో ప్రత్యూష బాగోగులను మహిళా శిశు, సంక్షేమ శాఖ చూస్తోంది. కాలం గడుస్తునన కొద్ది ఆమె ఆరోగ్యపరంగా మెరుగైంది. ఇక, నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే పెళ్లి విషయమై చరణ్ రెడ్డి ప్రత్యూషను సంప్రదించగా ఆమె అందుకు ఒకే చెప్పింది. ఈ విషయాన్ని ప్రత్యూష మహిళా శిశు సంక్షేమ అధికారులకు చెప్పడంతో.. వారు దీనిని కేసీఆర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యూషను పిలిచి మాట్లాడిని కేసీఆర్.. ఆమె పెళ్లాడబోయే చరణ్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక, తన పెళ్లికి కేసీఆర్ కచ్చితంగా వస్తారని చెప్పారని ప్రత్యూష తెలిపారు.ఇక, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పెండ్లి వేడుక కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆమె పెండ్లి వైభవంగా జరిపించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లుచేస్తున్నారు.

Related posts