telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సీఎం జగన్ నడపాలి : గంటా

Ganta srinivas tdp

స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటీకరణ ప్రకటన చేశాక పెద్ద ఉద్యమం ఎగసి పడిందని గంటా శ్రీనివాసరావు అన్నారు. జాతీయ రహదారిని, స్టీల్ ప్లాంట్ అధికారులను నిర్భందించారని…సీఎం జగన్ ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఉద్యమాన్ని నడపాలని సూచించారు. సీఎం ప్రైవేటికరణనుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే నిర్ణయం ముందుకు వెళ్ళాలని… 27 మంది ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఢిల్లీలో ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకుంటారని తెలిపారు. రాజీనామా అనేది బలమైన ఆయుధం ఖచ్చితంగా అవుతుందని.. పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని ఆయన కోరారు. తమిళ జల్లికట్టు స్పూర్తితో.. స్టీల్ ప్లాంట్ ఉద్యమ విషయంలో ముందుకు వెళ్లాలి.. ఒక్కరిపైఒకరు ఆరోపణలు చేసుకునే సమయం ఇది కాదని హితువు పలికారు .

Related posts