లాక్ డౌన్ అమల్వుతున్న నేపథ్యంలో నిరాశ్రయులుగా మిగిలిన వారిని ఆదుకునేందుకు న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఇక్కడ ఉంటున్న వలస కార్మికుల మధ్య ఆహారం కోసం జరిగిన గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో రెచ్చిపోయిన కొందరు పునరావాస కేంద్రాన్ని తగులబెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆరిపివేశాయి.
పోలీసుల కథనం ప్రకారం, ఇక్కడ పని చేస్తున్న వారిపై దాడికి దిగిన వలస కార్మికులు, ఆపై దానికి నిప్పంటించారు. పక్కనే ఉన్న యమునా రివర్ లోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. నదిలో దూకిన వారిలో ఒకరు మరణించారు.ఆపై తమ తోటి కార్మికుని మృతికి షెల్టర్ జోన్ స్టాఫ్ కారణమంటూ పలువురు నిరసనలకు దిగారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను తరలించగావారిపై రాళ్లు రువ్వారు. షెల్టర్ జోన్ ను తగులబెట్టిన కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ పునరావాస కేంద్రంలో దాదాపు 250 మంది వరకూ తలదాచుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, నదిలో మునిగి చనిపోయిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అమరావతిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు