అమ్మఒడి పథకం పై మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. సీఎం జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాలి. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను సగం చేశారు. మాటలు ఘనం, కోతలు సగం.. ఇదీ జగన్ గారి హామీల తీరు అని ఆయన మండిపడ్డారు.
మొదట ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివేవారికి లేదని మంత్రి ప్రకటించారు. ఆ తరువాత ఎక్కడ, ఏ స్కూలైనా అమ్మ ఒడి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీకి వచ్చేసరికి తెల్లకార్డు ఉన్నవారికే అని, పిల్లల్లో ఒకరికే అని అమ్మ ఒడిని కాస్తా ‘ఆంక్షల బడి’ చేశారు” అని నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో “అమ్మ ఒడి పథకంపై కూడా వైఎస్ జగన్ గారు తన మాట మార్చుడు.. మడమ తిప్పుడును యథేచ్ఛగా సాగించారని దుయ్యబట్టారు.