telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

TTD నూతన పాలకమండలి సభ్యులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మందితో కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగయ్యపేట), పొన్నాడ సతీష్‌(ముమ్మిడివరం), అనంతపురం జిల్లా నుంచి మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి అవకాశం దక్కింది.

ఇక తిరుమల తిరుపతి సభ్యులుగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు(ఉంగుటూరు), నాగ సత్యం యాదవ్‌(ఏలూరు)లకు ప్రభుత్వం ఇచ్చింది. అలానే ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్‌, కడప నుంచి యానాదయ్య, మాసీమ బాబు దక్కింది. అలానే కర్నూలు జిల్లా నుంచి వై. సీతారామిరెడ్డి(మంత్రాలయం), అనంతపురం నుంచి శరత్‌, అశ్వద్థనాయక్‌లకు టీటీడీ బోర్డులో చోటు దక్కింది. అలానే మేకా శేషుబాబు, రాంరెడ్డి సాముల, బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డిలకు పాలకమండలి అవకాశం దక్కింది.

పక్కరాష్ట్రాల నుంచి కూడా మరికొందరికి టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది. తమిళనాడు నుంచి డాక్టర్‌ శంకర్‌, కృష్ణమూర్తి,  కర్ణాటక నుంచి దేశ్‌పాండే లకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఎంపీ రంజీత్ రెడ్డి సతీమణీ సీతా రంజిత్‌రెడ్డి, మహారాష్ట్ర నుంచి అమోల్‌ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్‌ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలే నియమితులయ్యారు. ఆయన టీటీడీ ఛైర్మన్ గా  నియమితులు కావడం ఇది రెండో సారి. మరి… ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ పాలకమండలి.

 

Related posts