దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టులో నిందితుల తల్లిదండ్రులతో కలిసి న్యాయవాదులు ఆర్. సతీష్, పీవీ.కృష్ణమాచారి పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. అలాగే కస్టడీలో ఉన్న నిందితులను హత్య చేసినందుకుగాను ఒక్కో కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారాన్ని ఇప్పించాలని కోరారు. ఎన్ కౌంటర్ ఘటనపై దర్యాప్తు చేయాలని, ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే: పవన్ కల్యాణ్