వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకుగాను ప్రభుత్వం రూపొందించిన రెండవ విడత పట్టణ ప్రగతిని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గల్లీని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయని చెప్పారు. సిద్ధిపేటలోని 6వ వార్డులో సోమవారం ఉదయం వార్డులోని కాలనీల్లో పాదయాత్ర చేపట్టారు.
కాలనీ వాసులతో మాట్లాడి అక్కడి స్థానిక సమస్యలపై తెలుసుకున్నారు. ఇంటి గృహిణీలతో.. తడి, పొడి, హానికర చెత్త అంటే ఏమిటనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త ఎప్పుడు..? పొడి చెత్త ఎప్పుడు..? మన సిద్ధిపేట మున్సిపాలిటీ ఏ వారంలో ఏ చెత్త సేకరిస్తున్నదని స్థానిక ప్రజలను అడిగారు. ఈ పర్యటనలో భాగంగా ఓ ఇంటి ముందు డ్రమ్ములో నీరు నిల్వ ఉండటంతో, వాటి ద్వారా వచ్చే రోగాలపై ప్రజలకు మంత్రి అవగాహన కల్పించారు.