ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి విపక్షాల తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలకు మంచి జరుగుతుంటే.. ఎర్ర జెండా వెనక.. పచ్చ జెండా ఉందని జగన్ విమర్శించారు.
ఏ విషయంలోనైనా పట్టువిడుపులు ఉండాలంటూ వ్యతిరేకించే సంఘాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉద్యోగస్తులకు మంచి చేస్తుంటే.. పచ్చ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేస్తుంటే ఎల్లోమీడియా తప్పుడు ప్రచారాలు చేసి.. లబ్ధి పొందాలని చూడడం దారుణమన్నారు.
ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు కలిసి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. సంధి జరిగింది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంలేదని వారికి మంట అని అన్నారు.
చంద్రబాబు ఎల్లోమీడియాకు మాత్రమే సమ్మె కావాలని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు సమ్మెకు విరమించగానే క్రామేడ్లను చంద్రబాబు ముందుకు తోచారని ఆరోపణలు గుప్పించారు.సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారని అన్నారు. చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి.
‘ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి ఈనాడుకు ముద్దు బిడ్డ. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఆంధ్రజ్యోతికి ఆత్మీయుడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసిన చంద్రబాబు ఎర్రజెండాల కామ్రేడ్లకు ఆత్మీయుడు’ అయ్యాడని సీఎం జగన్ విమర్శించారు.
ఇక చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ జగన్ ఆరోపించారు. ఇలాంటి ఆందోళనలే కావాలంటూ జగన్ సెటైర్లు వేశారు. మా బాబు పాలనే బాగుంది అనే అజెండాతో ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి అన్నారు జగన్..
చంద్రబాబు తనిఖీపై హంగామా అవసరం లేదు: మంత్రి బొత్స