telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది..

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్‌ అవసరం లేదని, అన్ని సంస్థలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

టీకా తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు. ఫీవర్ సర్వే మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. వారం రోజుల్లోనే మొదటి విడత ఫీవర్ సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు. కరోనా నుండి త్వరగా బయటపడటానికి వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసిందని వెల్లడించారు. భవిష్యత్ లో ఎలాంటి వేరియెంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

జనవరి ఫస్ట్ నుంచి థర్డ్ వేవ్‌‌‌‌ మొదలైందని, జనవరి 17, 18వ తేదీ నాటికి ఈ వేవ్ పీక్‌‌‌‌ స్టేజ్‌కి వెళ్లిందని చెప్పారు. జనవరి మూడో వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందని అన్నారు. ఇంకో వారం, పది రోజుల్లో థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ ముగిసిపోయే అవకాశం ఉందని చెప్పారు. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.

ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయవచ్చని చెప్పారు. సమ్మక్క,సారక్క జాతరలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్‌ 100 శాతం పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా టీకాలు పంపిణీ చేశామని.. రెండో డోస్ 82 శాతం పూర్తి అయిందని తెలిపారు. టీనేజ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 73 శాతం పూర్తి అయిందని వెల్లడించారు.

Related posts