telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

జాయింట్‌ కలెక్టర్‌ వాహనానికి జరిమానా!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ఉన్నతాధికారి వాహనానికి జరిమానా విధించి, చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిరూపించారు. నిబంధనలు మీరితే ఎవరికైనా జరిమానా తప్పదని రుజువుచేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ కు చెందిన వాహనం (టీఎస్‌ 19 సీ1009), ఈ నెల 28న హైదరాబాద్ నగరానికి వచ్చింది. పరిమితికి మించి వేగంతో తిరుగుతూ అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లంపేట వద్ద స్పీడ్‌ లేజర్‌ గన్‌ కు చిక్కిపోయింది.

ఈ వాహనం అధిక వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిర్దేశించిన వేగం కంటే, అధిక స్పీడ్ తో వెళుతున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ-చలాన్ ను విధించారు. రూ. 1,000 జరిమానా, పైన యూజర్ చార్జీలు రూ. 35 కలిపి రూ. 1,035 జరిమానా విధించారు. 

Related posts